FIR: ఉగ్రదాడి ఎవరు చేశారు?

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ,  ఆయన స్వయంగా నిర్మించిన డార్క్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’. మను ఆనంద్‌ దర్శకుడు. కథానాయకుడు రవితేజ సమర్పిస్తున్నారు. అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల

Updated : 04 Feb 2022 07:16 IST

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ,  ఆయన స్వయంగా నిర్మించిన డార్క్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’. మను ఆనంద్‌ దర్శకుడు. కథానాయకుడు రవితేజ సమర్పిస్తున్నారు. అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ని కథానాయకుడు నాని గురువారం విడుదల చేశారు. ఉగ్రవాదం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ కథలో ఉగ్రదాడికి పాల్పడింది ఎవరు? ద్రోహి అనే ముద్ర ఎవరిపై పడిందనే విషయం కీలకమని ట్రైలర్‌నిబట్టి స్పష్టమవుతోంది. మంజిమామోహన్‌, రెబా మోనికాజాన్‌ తదితరులు నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని