‘ఆకాశమే నీ హద్దురా’.. సమంత రివ్యూ

కథానాయిక సమంత ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు ఫిదా అయ్యారు. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సుధా కొంగర దర్శకురాలు. ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారం రూపొందించారు.....

Updated : 01 Dec 2020 21:17 IST

హైదరాబాద్‌: కథానాయిక సమంత ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు ఫిదా అయ్యారు. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సుధా కొంగర దర్శకురాలు. ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించారు. ‘సింప్లీ ఫ్లై’ అనే పుస్తకం ఆధారంగా తీసిన ఈ చిత్రం నవంబరు 12న ఓటీటీ వేదికగా విడుదలైంది. ఇన్నాళ్లూ విహారయాత్రలో ఉన్న సమంత తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించారు. దీనికి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వొచ్చంటూ యూనిట్‌ సభ్యుల్ని మెచ్చుకున్నారు.

‘‘ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ‘ఆకాశమే నీ హద్దురా’. ఇది ఓ ఆణిముత్యం. సూర్య సర్‌, అపర్ణ బాలమురళి నటన అద్భుతంగా ఉంది. సుధా కొంగర డైరెక్షన్‌ అమేజింగ్‌. నాకు అవసరమైన ప్రేరణ, స్ఫూర్తి ఈ చిత్రంలో ఉన్నాయి’’ అని సామ్‌ సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వారం రోజుల క్రితం ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. సోమవారం తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. ‘జాను’ తర్వాత ఆమె తొలిసారి ‘ది ఫ్యామిలీ మెన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ కోసం పనిచేశారు. ఓటీటీ వేదికగా ఇది త్వరలో విడుదల కాబోతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని