సుశాంత్‌ మృతికి ముందు రోజు అలా చేయలేదు!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణించడానికి ముందు రోజు నటి రియా చక్రవర్తితో కనిపించారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు సుశాంత్‌ రియాను ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లారని కూడా వదంతులు వచ్చాయి. ఇవన్నీ కేవలం కల్పితాలేనని, ఏ మాత్రం వాస్తవం కాదని రియా తరఫు

Published : 12 Oct 2020 01:13 IST

రియా తరఫు న్యాయవాది

ముంబయి: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణించడానికి ముందు రోజు నటి రియా చక్రవర్తితో కనిపించారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు సుశాంత్‌ రియాను ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లారని కూడా వదంతులు వచ్చాయి. ఇవన్నీ కేవలం కల్పితాలేనని, ఏ మాత్రం వాస్తవం కాదని రియా తరఫు న్యాయవాది సతీష్‌ మానేషిండే ప్రకటన విడుదల చేశారు. ‘రియా బెయిలుపై బయటికి వచ్చిన తర్వాత తప్పుడు ఆరోపణలతో ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వారికి, సోషల్‌మీడియాలో కాసేపు కాలక్షేపం కోసం కామెంట్లు చేసిన వారికి సమాధానం చెబుతామని నేను ఇప్పటికే చెప్పా. జూన్‌ 13న సుశాంత్‌.. రియాను ఇంటి వద్ద డ్రాప్‌ చేశారని.. ఆ విషయం కొందరు తనకు చెప్పారని డింపుల్‌ తవానీ (రియా పక్కింటి మహిళ) ఆరోపణలు చేశారు. అందులో వాస్తవం లేదు. కేవలం గుర్తింపు కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం ఆమె అలా అన్నారు. ఆమెను కూడా సీబీఐ విచారించింది. త్వరలోనే నిజాలు బయటపడతాయి. సత్యమేవ జయతే’ అని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

సుశాంత్‌ కేసులో అరెస్టయిన రియా అక్టోబరు 7న బెయిలుపై జైలు నుంచి బయటికి వచ్చారు. ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి మాత్రం జైలులోనే ఉన్నారు. రియాకు బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు పలు షరతులు విధించింది. పది రోజులకు ఒకసారి దగ్గరిలోని పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. పాస్‌పోర్ట్‌ డిపాజిట్‌ చేయాలని, దేశాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించింది. పూచీకత్తు కింద రూ.లక్ష చెల్లించాలని పేర్కొంది. సుశాంత్‌ మృతి కేసు విచారణ, సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని