బాండ్‌ సందడి

యాక్షన్‌ చిత్రాల్లో జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకున్నా ప్రత్యేకతే వేరు. బాండ్‌ చిత్రాలకు కోట్లాదిమంది అభిమానులున్నారు. ఇప్పటివరకూ 24 జేమ్స్‌బాండ్‌ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి.

Updated : 02 Sep 2021 07:14 IST

యాక్షన్‌ చిత్రాల్లో జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకున్నా ప్రత్యేకతే వేరు. బాండ్‌ చిత్రాలకు కోట్లాదిమంది అభిమానులున్నారు. ఇప్పటివరకూ 24 జేమ్స్‌బాండ్‌ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు 25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ తెరకెక్కింది. డేనియల్‌ క్రేగ్‌ కథానాయకుడిగా, రమీ మాలేక్‌ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి కారీ జోజి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మనదేశంలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ నెల 30న, అమెరికాలో అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేసిన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని