వంద మీటర్ల స్థలంలో.. రెండు గంటల సినిమా

సీనియర్‌ నటుడు వినోద్‌ కుమార్‌, తాన్యా దేశాయ్‌, అంకిత్‌ రాజ్‌, కావ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్‌ లైట్‌’. విశ్వప్రసాద్‌ దర్శకుడు. మామిడాల శ్రీనివాస్‌ నిర్మాత. ఈ సినిమాని ఈనెల మూడో

Updated : 10 Sep 2021 07:46 IST

సీనియర్‌ నటుడు వినోద్‌ కుమార్‌, తాన్యా దేశాయ్‌, అంకిత్‌ రాజ్‌, కావ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్‌ లైట్‌’. విశ్వప్రసాద్‌ దర్శకుడు. మామిడాల శ్రీనివాస్‌ నిర్మాత. ఈ సినిమాని ఈనెల మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక హాట్‌ థ్రిల్లర్‌. క్రైమ్‌, లవ్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌.. ఇలా అన్నీ ఉంటాయి’’ అన్నారు. ‘‘వినోద్‌ కుమార్‌, తాన్యా ఈ చిత్రానికి రెండు కళ్లు. ఆ కళ్లను చూపించిన వారు కెమెరామెన్‌ రవికుమార్‌. సినిమా మొత్తాన్ని అనుకున్నట్లుగా నిర్మించింది మామిడాల శ్రీనివాస్‌. రెండు గంటల సినిమాని వంద మీటర్ల స్థలంలో ఓ స్ట్రీట్‌ లైట్‌ కింద ఎంతో చక్కగా తీశాం. దాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. అందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు. నాయిక తాన్యా మాట్లాడుతూ.. ‘‘ఇది నా తొలి సినిమా. నాకింత మంచి చిత్రంలో అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అంది. ‘‘స్ట్రీట్‌ లైట్‌ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించారు. మంచి సందేశం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామ’’న్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్‌, బాలాజీ నాగలింగం, ప్రసన్న కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు