భాజపాలోకి విశాల్‌..?

కోలీవుడ్‌ నటుడు విశాల్ పొలిటికల్‌ ఎంట్రీకి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చింది. విశాల్‌ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొన్నిరోజులుగా పలు ప్రసార మాద్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Updated : 14 Sep 2020 19:09 IST

క్లారిటీ ఇచ్చిన మేనేజర్‌

చెన్నై: కోలీవుడ్‌ నటుడు విశాల్ పొలిటికల్‌ ఎంట్రీకి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చింది. విశాల్‌ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొన్నిరోజులుగా పలు ప్రసార మాద్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఆయన త్వరలోనే భాజపా తీర్థం పుచ్చుకోనున్నారంటూ సోషల్‌మీడియాలో పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ తరుణంలో విశాల్‌ మేనేజర్‌ హరికృష్ణన్‌ సదరు వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. విశాల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని, కాబట్టి ఎవరూ ఆ వార్తలను నమ్మవద్దని సూచించారు. హరికృష్ణన్ పెట్టిన ట్వీట్‌తో విశాల్‌ ఇప్పట్లో రాజకీయాల్లోకి రావడం లేదని అభిమానులకు స్పష్టత వచ్చింది.

ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కంగన ధైర్యాన్ని ప్రశంసిస్తూ విశాల్‌ ఓ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘ప్రభుత్వాలు తప్పులు చేసినప్పుడు తమ గళాన్ని ఎలా వినిపించాలో తెలియజేస్తూ ప్రజలకు ఓ పెద్ద ఉదాహరణగా నిలిచావు. ఇది 1920లలో భగత్‌సింగ్‌ చేసిన పోరాటంలాంటిదే’ అని విశాల్‌ పేర్కొన్నారు. అయితే విశాల్‌ పెట్టిన సదరు ట్వీట్‌.. ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారు.. ముఖ్యంగా భాజపా కండువా కప్పుకోనున్నారనే ఊహాగానాలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని