Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
‘లాహిరి లాహిరి లాహిరిలో’తో తొలి ప్రయత్నంలోనే నటుడిగా విశేష క్రేజ్ సంపాదించుకున్నారు ఆదిత్య ఓం. కొన్నాళ్ల విరామం అనంతరం ‘దహనం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘మీరు ఇంకా బతికే ఉన్నారా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టేవారు’’ అని నటుడు ఆదిత్య ఓం (Aditya Om) తాను ఎదుర్కొన్న విమర్శలపై స్పందించారు. మూడేళ్లు డిప్రెషన్‌లో ఉన్నానని, కుటుంబ ప్రోత్సహంతో దాన్నుంచి బయట పడ్డానని తెలిపారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ (lahiri lahiri lahirilo), ‘ధనలక్ష్మీ ఐ లవ్ యు’, ‘మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ హీరో.. కొన్నాళ్ల విరామం అనంతరం ‘దహనం’ (Dahanam) చిత్రంలో నటించారు. ఆ సినిమా శుక్రవారం విడుదలైంది. ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టాలీవుడ్‌లోని తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. కెరీర్‌లో బ్రేక్ రావడంతో ట్రోలింగ్‌కు గురయ్యానన్నారు. ఎవరూ కావాలని విరామం తీసుకోరని పేర్కొన్నారు.
‘‘డిప్రెషన్ ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేదే. ఒకానొక సమయంలో నేనూ దానికి లోనయ్యా. ఫ్యామిలీ సపోర్ట్‌తో సులువుగా బయటపడ్డా. అప్పట్లో రోజుకి 60 సిగరెట్లు తాగేవాణ్ని. అలాంటి నేను 2017లో ఓ రోజు ఉదయం లేవగానే ‘ఇకపై ధూమపానం, మద్యపానం చేయకూడదు’ అని ఫిక్స్ అయ్యా. అలా ఎందుకు చేశానో నాకే తెలియదు. కానీ, ఇప్పటికీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. వాటికి దూరంగా ఉండడం వల్లే 46 ఏళ్ల వయసులోనూ ఇలా కనిపిస్తున్నానేమో (నవ్వుతూ). ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే.. సినిమా రంగంలో ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాల్సిందే. ప్రశంసలకు పొంగికూకుడదు. విమర్శలకు కుంగిపోకూడదు. జయపజయాలను ఒకేలా స్వీకరించాలి’’ అని వర్ధమాన నటులకు ఆదిత్య సలహా ఇచ్చారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నా బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారాయన. అక్కడ కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘దహనం’ ఇప్పటికే ఆరు అంతర్జాతీయ అవార్డులు పొందింది. ఈ పీరియాడికల్ సినిమాకి మూర్తి సాయి దర్శకత్వం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Swaminathan: ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
-
ODI WC 2023: ప్రపంచకప్ స్క్వాడ్ ఫైనలయ్యేది నేడే.. ఆ ఒక్కరు ఎవరు?
-
EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..
-
Fake News: ఎక్స్ కీలక నిర్ణయం.. నకిలీ వార్తలపై ఫిర్యాదు ఫీచర్ తొలగింపు..!
-
Manipur Violence: మణిపుర్లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్ అధికారికి పిలుపు..
-
Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహంపై క్లారిటీ ఇచ్చిన మ్యూజియం నిర్వాహకులు..