Aditya 369 movie: అందుకే కమల్‌హాసన్‌ ‘ఆదిత్య 369’ చేయలేదు

బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ విశేషంగా ప్రేక్షకులను అలరించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ తప్పకుండా ఉంటుంది.

Published : 14 Jan 2024 14:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ విశేషంగా ప్రేక్షకులను అలరించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ తప్పకుండా ఉంటుంది. ప్రయోగాల దర్శకుడిగా పేరున్న సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. టైమ్‌ మెషీన్‌ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది.

ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించారు. కృష్ణకుమార్‌గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే, తొలుత కృష్ణ కుమార్‌ పాత్రలో కమల్‌ హాసన్‌ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించారట దర్శక-నిర్మాతలు. ఇక శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రకు బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని ఆ పాత్రకు ఆయన్ను ఎంపిక చేశారు. కృష్ణ కుమార్‌ పాత్రకు మాత్రం కమల్‌ సరిపోతారని, ఈ ఇద్దరితో మల్టీస్టారర్‌గా తెరకెక్కిందామనుకున్నారు. అయితే, అప్పటికి కమల్‌హాసన్‌ మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు సాధ్యం కాలేదు. దీంతో బాలకృష్ణే రెండు పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని