Oh My God 2: నీకు తోడు.. శివుడున్నాడు

బాలీవుడ్‌లో రానున్న సీక్వెల్‌ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాటిల్లో ‘ఓఎంజీ2’ ఒకటి. 2012లో వచ్చిన ‘ఓ మై గాడ్‌’కు సీక్వెల్‌గా అమిత్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 04 Aug 2023 13:55 IST

బాలీవుడ్‌లో రానున్న సీక్వెల్‌ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాటిల్లో ‘ఓఎంజీ2’ ఒకటి. 2012లో వచ్చిన ‘ఓ మై గాడ్‌’కు సీక్వెల్‌గా అమిత్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్రను పోషిస్తుండగా, ఆయన భక్తుడిగా కాంతి అనే పాత్రలో పంకజ్‌ త్రిపాఠి నటించారు. యామీ గౌతమ్‌ న్యాయవాది పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఒక సంఘటన వల్ల పాఠశాల నుంచి తొలగించిన కాంతి కుమారుడికి సహాయం చేయడానికి ఒక దూతను పంపమని విశ్వాసపాత్రుడైన నందికి శివుడిచ్చే ఆదేశంతో మొదలైన ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. ‘గంగా నది ఏ దిశగా ప్రవహిస్తుందో నాకు చెప్పకు...విశ్వాసం కలిగి ఉండు. శివుడు నీకు తోడుగా ఉన్నాడు’ లాంటి మాటలతో ‘హర హర మహాదేవ్‌’ అనే నేపథ్య గీతంతో, కోర్టులో జరిగిన సన్నివేశాలతో ట్రైలర్‌ మరింత ఆకర్షణగా నిలిచింది. చిత్ర ట్రైలర్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ‘శివుడిగా అక్షయ్‌ కనిపిస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు’ అని ఒకరు...‘ఈ సినిమా తప్పక మంచి విజయాన్ని సాధిస్తుంది’ అంటూ మరొకరు ఈ చిత్రం పట్ల తమ ఆసక్తిని తెలిపారు. తన కొడుకును కాపాడుకోవటానికి భక్తుడైన కాంతికి శివుడు ఏ విధంగా సహాయం చేస్తాడు, ఒక సంఘటన సాధారణ కుటుంబంలోని ఆయన జీవితాన్ని ఎలా మార్చేసిందో తెలియాలంటే ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమాను చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని