సునీత, బీటెక్‌ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది.

Updated : 30 Apr 2024 10:07 IST

ఈనాడు, అమరావతి: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. మరో బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని సోమవారం ఆదేశించింది. ఈ వ్యాజ్యాల విచారణ నుంచి ఇప్పటికే ఓసారి జస్టిస్‌ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం వైదొలగిన విషయం తెలిసిందే. వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని