Allu arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..!

సినీ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) ఖాతాలో మరో ఘనత చేరినట్లు సమాచారం. ఈ వార్తతో బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Updated : 19 Sep 2023 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ (Allu Arjun)కు మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame Tussauds) మ్యూజియంలో అతడి మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తను అతడి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడం కోసం బన్నీ లండన్‌కు వెళ్లనున్నారట. ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన మరో దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్‌ నిలుస్తాడు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే. 

రాజమౌళి సమర్పణలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’.. ఆసక్తిగా వీడియో

ఇక సుకుమార్‌ (Sukumar)- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa The Rise)తో బన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఓర్మాక్స్‌ మీడియా బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల గురించి సర్వే నిర్వహించింది. అందులో ‘పుష్ప2’ టాప్‌ వన్‌లో నిలిచింది. దీంతో ఈ సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. ఇక ఈ సర్వేలో సల్మాన్‌ ‘టైగర్‌3’ మూడులో ఉండగా.. షారుక్‌ ‘డుంకీ’ ఐదో స్థానంలో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని