Rajamouli: రాజమౌళి సమర్పణలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’.. ఆసక్తిగా వీడియో

దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఓ పాన్‌ ఇండియా సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ఇది తెరకెక్కుతోంది.

Updated : 19 Sep 2023 17:03 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి తాజాగా చేసిన ట్వీట్‌ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. భారతీయ సినిమా రంగంపై వస్తున్న బయోపిక్‌ను ఆయన సమర్పించనున్నారు. రెండు రోజులుగా రాజమౌళి నుంచి ఓ భారీ ప్రకటన రానుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందరూ అనుకున్న విధంగానే ఆయన ఓ భారీ సినిమాను ప్రజెంట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

అసలు ఇండియన్‌ సినిమా ఎక్కడ పుట్టింది. దానికి మూలం ఏంటి అనే కథతో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ (Made In India) అనే సినిమా తెరకెక్కనుంది. ఇండియన్‌ సినిమాకు ఆద్యుడైన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే గురించి ఇందులో చూపనున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది భారతీయ సినిమాపై బయోపిక్‌. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన చిత్రం రాజమౌళి సమర్పణలో రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకధీరుడు ట్వీట్‌ చేశారు. ‘‘ఈ కథ విన్నవెంటనే నేను భావోద్వేగానికి గురయ్యాను. బయోపిక్‌లను రూపొందించడం చాలా కష్టం. అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్‌ను చిత్రీకరించాలంటే అది మరింత సవాళ్లలో కూడుకున్నది. ఈ చిత్ర యూనిట్‌ ఆ సవాళ్లకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్నారు. ఇది పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. భారతీయ సినిమా పుట్టుక, ఎదుగుదల ఇందులో చూపించనున్నారు. ఆరు భాషల్లో ఈ చిత్రం రానుంది.

ఆయనతో మాట్లాడి ‘జవాన్‌’ను ఆస్కార్‌కు పంపుతా: అట్లీ

ఇక ప్రస్తుతం మహేశ్‌ బాబుతో కలిసి రాజమౌళి ఓ సినిమా చేయనున్నారు. ఇది యాక్షన్‌ అడ్వంచర్‌గా రూపొందనుందన్న వార్త మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా బయటకు వచ్చింది. తాజాగా రాజమౌళి నుంచి ప్రకటన వస్తుందని వార్త రావడంలో మహేశ్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తారని అందరూ అనుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని