Anupama Parameswaran: భావోద్వేగాల ‘బటర్‌ఫ్లై’

‘18పేజెస్‌’ చిత్రంతో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది అనుపమ పరమేశ్వరన్‌. ఇప్పుడామె ‘బటర్‌ఫ్లై’గా ఓటీటీ వేదిక థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతోంది.

Updated : 26 Dec 2022 06:47 IST

‘18పేజెస్‌’ (18 Pages) చిత్రంతో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). ఇప్పుడామె ‘బటర్‌ఫ్లై’గా (Butterfly) ఓటీటీ వేదిక థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఘంటా సతీష్‌బాబు తెరకెక్కించారు. రవిప్రకాష్‌ బోడపాటి, ప్రసాద్‌ తిరువల్లూరి, ప్రదీప్‌ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మించారు. నిహాల్‌, భూమికా చావ్లా, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 29న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయిక అనుపమ మాట్లాడుతూ.. ‘‘గతేడాది డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభించాం. నెల రోజుల్లోనే సినిమా పూర్తి చేశాం. నిర్మాణాంతర పనుల్ని ఏడాది టైమ్‌ తీసుకొని ఎంతో నాణ్యతతో చేశారు. ఈ సినిమాలో నేను గీత అనే పాత్రలో కనిపిస్తాను. చాలా భావోద్వేగభరితమైన పాత్రిది. అందుకే ఈ పాత్ర చేయడం నాకెంతో సవాల్‌గా అనిపించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఆద్యంతం థ్రిల్‌ పంచుతుంది’’ అంది. ‘‘ఇదొక అద్భుతమైన చిత్రం. నేనిందులో విశ్వ అనే పాత్ర చేశా. అనుపమతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు హీరో నిహాల్‌. ఈ కార్యక్రమంలో సతీష్‌బాబు, ప్రసాద్‌ తిరువళ్లూరి, అర్విజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని