
VishwakSen: ‘అశోకవనంలో అర్జున కల్యాణం’.. ఓటీటీ స్ట్రీమింగ్ అప్పటి నుంచే
ఇంటర్నెట్ డెస్క్: ఈ వేసవిలో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. విశ్వక్‌సేన్ హీరోగా దర్శకుడు విద్యాసాగర్ చింతా తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ‘ఆహా’లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది ‘ఆహా’. భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్ నాయికలుగా మెరిసి, విశేషంగా ఆట్టుకున్నారు. గోపరాజు రమణ, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మే 27 నుంచే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవల కొన్ని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో వాటికి చెక్ పెట్టినట్టైంది.
కథేంటంటే: అల్లం అర్జున్ కుమార్ అలియాస్ అర్జున్ (విశ్వక్‌సేన్) (Vishwaksen) సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ల వర్గంలో అమ్మాయిలు తక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల పెళ్లి సంబంధం కుదరడం కష్టమవుతుంది. దీంతో 33 ఏళ్లు వచ్చినా పెళ్లి అవ్వదు. ఆఖరికి గోదావరి జిల్లాలో ఓ సంబంధం సెట్ అవుతుంది. ఆమే మాధవి (రుక్సార్). అక్కడ నిశ్చితార్థం అయ్యాక అర్జున్‌కి షాకింగ్ (Rukshar Dhillon) విషయం తెలుస్తుంది. అదేంటి, ఆ తర్వాత ఏం జరిగింది. అర్జున్ - మాధవిల కథలో వసుధ (రితికా నాయక్) ఎందుకొచ్చింది అనేదే అసలు కథ (Ashoka Vanamlo Arjuna Kalyanam).
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine Crisis: రష్యాలో భారీ పేలుళ్లు..!
-
Politics News
Devendra Fadnavis: భాజపా, శివసేన.. వేర్వేరు అనుకోలేదు: ఫడణవీస్
-
Sports News
Bumrah : బుమ్రాకు టెస్టు క్రికెట్ చాలా తేలికగా అనిపిస్తోంది : అజిత్ అగార్కర్
-
General News
Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
India News
India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
-
World News
Israel: హెజ్బొల్లా డ్రోన్లను కూల్చిన ఇజ్రాయెల్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి