Baby: ఓటీటీలో దుమ్ములేపుతోన్న ‘బేబీ’.. 32 గంటల్లోనే 100 మిలియన్లు

ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రం ‘బేబీ’ (baby). తాజాగా ఈసినిమా ఓటీటీలో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది.

Updated : 26 Aug 2023 15:30 IST

హైదరాబాద్‌: ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్‌ అశ్విన్‌ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటించిన ముక్కోణపు ప్రేమకథా చిత్రం ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకుడు. థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా గురువారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. స్ట్రీమింగ్‌ మొదలైన 32 గంటల్లోనే దాదాపు 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తాజాగా ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఓటీటీలోనూ ‘బేబీ’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుందని పేర్కొంది. ఈ విషయంపై ఆనంద్‌ సంతోషం వ్యక్తం చేశారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ.. రాహుల్‌ సిప్లిగంజ్‌ క్లారిటీ

క‌థేంటంటే: వైషు అలియాస్ వైష్ణ‌వి (వైష్ణ‌వి చైత‌న్య‌) ఓ బ‌స్తీ అమ్మాయి. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమ‌ను అత‌నూ అంగీక‌రిస్తాడు. అయితే ప‌దో త‌ర‌గ‌తి త‌ప్ప‌డంతో ఆనంద్ (Anand devarakonda) ఆటో డ్రైవ‌ర్‌గా స్థిర‌ప‌డ‌తాడు. వైష్ణవి (Vaishnavi chaitanya) మాత్రం ఇంట‌ర్ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్క‌డ కొత్త ప‌రిచ‌యాల వ‌ల్ల వైషూ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఈ క్ర‌మంలోనే ఆమెకు త‌న క్లాస్‌మేట్‌ విరాజ్ (విరాజ్ అశ్విన్)తో స్నేహం మొదలవుతుంది. అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల విరాజ్‌కు వైష్ణ‌వి శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?  వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఆనంద్‌కు తెలిసిందా?  నిజం తెలిశాక త‌ను ఎలా స్పందించాడు? అలాగే విరాజ్‌కు వైష్ణ‌వి - ఆనంద్‌ల ప్రేమ‌క‌థ తెలిసిందా? అస‌లు ఆనంద్ - విరాజ్‌ల‌లో వైష్ణ‌వి ఎవ‌ర్ని ప్రేమించింది? అనే ఆసక్తికర అంశాలతో ఈసినిమా తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు