Bade Miyan Chote Miyan: మమ్మల్ని ఆపేదెవరు?

‘ఒకరి కోసం మరొకరు ప్రాణాలు వదులుకునేంత మంచి స్నేహితులం మేము. అవసరమైతే దేశం కోసం ఒకరినొకరం చంపుకోవడానికైనా వెనకాడమ’ని అంటున్నారు బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌

Updated : 27 Mar 2024 11:39 IST

‘ఒకరి కోసం మరొకరు ప్రాణాలు వదులుకునేంత మంచి స్నేహితులం మేము. అవసరమైతే దేశం కోసం ఒకరినొకరం చంపుకోవడానికైనా వెనకాడమ’ని అంటున్నారు బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌. మరి దేశం కోసం ప్రాణాలకు లెక్కచేయకుండా ఎందుకు వీళ్లు సాహసాలు చేస్తున్నారో తెలియాలంటే ‘బడేమియా ఛోటేమియా’ చూడాల్సిందే. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు అక్షయ్‌. ‘‘అంతం కాబోతున్న ప్రపంచాన్ని రక్షించడానికి వస్తున్నాము. మమ్మల్ని ఎవరు ఆపుతారు?’’ అని వ్యాఖ్యల్ని జోడించారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడే సైనికులుగా అక్షయ్‌, టైగర్‌ కనిపిస్తూ.. వారి చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇందులో కబీర్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో ఇమ్రాన్‌ హష్మి కనిపించనున్నారు. మానుషి చిల్లర్‌, అలయా ఎఫ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 10న రానుంది. వాషు భగ్నానీ, జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని