Bigg Boss 5: సన్నీ.. నీ గురించి ఏమనుకుంటున్నావు! సిరి వాగ్వాదం..!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5(Bigg boss telugu 5) చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో టాప్‌-5 ఫైనలిస్ట్‌లకు సంబంధించిన

Updated : 16 Dec 2021 18:42 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5(Bigg boss telugu 5) చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో టాప్‌-5 ఫైనలిస్ట్‌లకు సంబంధించిన జర్నీని బిగ్‌బాస్‌ ప్రదర్శించాడు. 100 రోజులకు పైగా హౌస్‌లో ఉన్న తమ ప్రయాణాన్ని చూసుకుని హౌస్‌మేట్స్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ సీజన్‌లో అలరించిన కొన్ని టాస్క్‌లను ఇంటి సభ్యులతో మరోసారి ఆడించాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా ‘లేబుల్‌ లేదు మచ్చా’ అంటూ టీషర్టు టాస్క్‌ ఇచ్చాడు. టీషర్టు ధరించి స్విమ్మింగ్‌ ఫూల్‌లో అటూ ఇటూ స్విమ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో మానస్‌, షణ్ముఖ్ పాల్గొన్నారు. ఇక ఒక సీక్వెన్స్‌లో కొన్ని శబ్దాలు ప్లే చేస్తే, వాటిని అవే వరుసలో ఇంటిసభ్యులు రాయాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఈ టాస్క్‌లో కప్ప సౌండ్‌ విని సన్నీ Frog అని రాయబోయి Forg అని రాయడం, కప్పకూ ఎలుకకు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని సిరిని బిగ్‌బాస్‌ అడగటం నవ్వులు పూయిస్తోంది. మరోసారి సన్నీ-సిరిల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ‘నువ్వెవరు’ అంటే ‘నువ్వెవరు’ అంటూ వాదించుకున్నారు.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని