మహేశ్‌ ఆనందం.. రష్మిక వర్కౌ‌ట్స్‌

వ్యాయామం విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని కథానాయిక రష్మిక అంటున్నారు. ‘నీకు సాధించాలని ఉంటే.. వెళ్లి అందుకో’ అంటూ జిమ్‌ వీడియో షేర్‌ చేశారు. అందులో ఆమె అధిక బరువును లిఫ్ట్‌ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.....

Updated : 08 Dec 2022 17:10 IST

సోషల్‌లుక్‌: సినీ తారల విశేషాలు..

* వ్యాయామం విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని కథానాయిక రష్మిక అంటున్నారు. ‘నీకు సాధించాలని ఉంటే.. వెళ్లి అందుకో’ అంటూ జిమ్‌ వీడియో షేర్‌ చేశారు. అందులో ఆమె అధిక బరువును లిఫ్ట్‌ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.

* అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుకు స్పా చేయించుకోవడం అంటే చాలా ఇష్టమట. కరోనాకు ముందు ట్రిప్‌లో తీసిన ఫొటోను నమ్రత షేర్‌ చేశారు. కామాలయా రిసార్ట్‌లో తీసుకున్న ఫొటో అదని తెలిపారు. నిజంగానే మహేశ్‌ ముఖం ఫొటోలో చాలా ఆనందంగా కనిపించింది.

* యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ కొత్త లుక్‌లో కనిపించి, సర్‌ప్రైజ్‌ చేశారు. గౌరవ్‌ గుప్తా డిజైన్‌ చేసిన తెలుపు రంగు కుర్తాలో మెరిశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

* నటి హంస నందిని ఈ వారాంతాన్ని అందమైన కొండల్లో గడుపుతున్నారట. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె వీడియో షేర్‌ చేశారు. పచ్చని చెట్ల మధ్య పాస్తా చేసి, చూపించారు.
* కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన బృందంతో కలిసి తీసుకున్న వీడియో షేర్‌ చేశారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రతిసారి తమ టీం ఇలా కేక్‌ కట్ చేస్తుందని పేర్కొన్నారు. తను అందంగా కనిపించడానికి కారణం వారేనని తెలిపారు.













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని