కంటికి కనిపించని దుష్టశక్తితో పోరాటం.. ఉత్కంఠ రేపుతున్న ‘చతుర్ముఖం’ ట్రైలర్‌

ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళ చిత్రం ఇక్కడ ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన ‘చతుర్ముఖం’ ఏప్రిల్‌లో విడుదలై ప్రశంసలు అందుకుంది.

Published : 10 Aug 2021 19:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళ చిత్రం ఇక్కడ ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన ‘చతుర్ముఖం’ ఏప్రిల్‌లో విడుదలై ప్రశంసలు అందుకుంది. రంజిత్ కామ‌ల శంక‌ర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తెలుగు అభిమానుల కోసం ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ డబ్‌ చేసింది. ఈ నెల 13 నుంచి అందుబాటులోకి రానుంది. కాగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను ఆహా యూట్యూబ్‌ వేదికగా పంచుకుంది.

జీవితంలో ఒక అమ్మాయికి కావాల్సినవి విద్య, ఆర్థికంగా బాగా ఉండటం.. ఈ రెండూ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి.. అనే సంభాషణతో సాధారణంగా ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌.. ఉత్కంఠ రేపుతూ సాగుతుంది. దెయ్యాలు, భూతాలున్నాయంటే నమ్మని ఓ మధ్య తరగతి అమ్మాయిని ఏదో కనిపించని శక్తి వెంటాడుతూ ఉంటుంది. తన ఫోన్లోనే తనకు తెలియకుండా దూరిపోయి ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ అమ్మాయి ఆ శక్తిని ఎలా ఎదురించింది. ఆమె ఎలాంటి ఇబ్బందులు పడింది అనేదే కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని