vishwambhara: సంక్రాంతి బరిలోనే విశ్వంభర

‘విశ్వంభర’ చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు చిరంజీవి. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు విడుదల తేదీపైనా స్పష్టత ఇచ్చారు.

Updated : 03 Feb 2024 09:58 IST

జనవరి 10న విడుదల

‘విశ్వంభర’ చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు చిరంజీవి. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు విడుదల తేదీపైనా స్పష్టత ఇచ్చారు. ఈ సినిమాని 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శుక్రవారం చిరు ఈ చిత్ర షూటింగ్‌లోకి అడుగు పెట్టినట్లు తెలియజేస్తూ.. విడుదల తేదీని ప్రకటించారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తోంది చిత్ర బృందం. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీనికి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తుండగా.. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని