Bigg Boss 5: నాగార్జున ట్విస్ట్‌: ప్రియ.. లోబోల్లో ఒకరు హౌస్‌ నుంచి బయటకు.. కారణం అదేనా?

‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’లో శనివారం నాగార్జున ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. గతవారం ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌ విషయంలో పంచాయతీ

Updated : 16 Oct 2021 18:28 IST

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’లో శనివారం నాగార్జున ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. గతవారం ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌ విషయంలో పంచాయతీ అయిపోగానే, హౌస్‌మేట్స్‌ను వ్యక్తిగతంగా పిలిచి ఎవరూ ఊహించని ప్రశ్న ఒకటి అడిగారు. ‘హౌస్‌లో ఉండేందుకు అర్హతలేని ఒకరి పేరు చెప్పండి’ అని అడిగారు. దీంతో షాకైన హౌస్‌మేట్స్‌ తలలు పట్టుకున్నారు. కొద్ది సమయం కావాలని శ్రీరామ్‌ అడగ్గా, నాగార్జున కౌంట్‌డౌన్‌ కూడా స్టార్ట్‌ చేశారు. ఇక ‘బిగ్‌బాస్‌’ స్ట్రాటజీ గేమర్‌ కాజల్‌ అయితే, రెండు పేర్లు చెబుతానని అన్నది. కానీ, నాగార్జున అందుకు ఒప్పుకోలేదు. ఒకపేరే చెప్పాలని అన్నారు. అలా హౌస్‌లో ఉన్న వారిలో నలుగురు ప్రియను, మరో నలుగురు లోబో పేరును చెప్పారు. వీరిలో ఒకరు హౌస్‌ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని, చివరిగా ఎవరు హౌస్‌లో ఉండాలనుకుంటున్నారో చెప్పాలని నాగార్జున ఆదేశించాడు. అనీ మాస్టర్‌ ఎటూ తేల్చుకోలేకపోతుంటే నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గట్టిగా అరిచారు. మరి నిజంగా వీరిలో ఒకరు బయటకు వెళ్లారా? లేక ఇదేమైనా సీక్రెట్‌ టాస్కా? తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలోనూ ఇలాగే ఒక హౌస్‌మేట్‌ను ఇంటి నుంచి బయటకు పంపుతున్నట్లు చెప్పి, సీక్రెట్‌ గదిలో ఉంచారు. అన్నట్లు ఈ వారం నామినేషన్స్‌లో లోబో ఉన్నాడు. మరోవైపు లోబో భార్యకు నెలలు నిండటంతో ఈ వారం అతడు ఎలిమినేట్‌ అవుతాడని సామాజిక మాధ్యమాల్లో టాక్‌ నడుస్తోంది. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు