Beast: విజయ్ నమ్మేది ఆ ఒక్కటే.. పూజా ‘పాన్ ఇండియా హీరోయిన్’: దిల్ రాజు
నటుడు విజయ్ పెద్ద స్టార్ అయినా సగటు ప్రేక్షుకుడిలానే కథలను ఎంపిక చేసుకుంటారని, పూజాహెగ్డే.. పాన్ ఇండియా హీరోయిన్ అని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు.
హైదరాబాద్: నటుడు విజయ్ కథను మాత్రమే నమ్ముతారని, పూజాహెగ్డే.. పాన్ ఇండియా హీరోయిన్ అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. విజయ్, పూజా జంటగా నటించిన చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా శుక్రవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘వైవిధ్య భరిత కథలకు కమర్షియల్ హంగులు జోడించి, మెప్పించిన దర్శకుడు నెల్సన్. ‘బీస్ట్’తో మరోసారి సత్తా చాటబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా కోసం అనిరుధ్ అందించిన ‘అరబిక్ కుతు’ ప్రపంచవ్యాప్త శ్రోతల్ని ఉర్రూతలూగించింది. పూజాహెగ్డే అడుగుపెడితే ఏ సినిమా అయినా సూపర్‌హిట్టే. అన్ని భాషల్లోనూ నటిస్తూ ‘పాన్ ఇండియా హీరోయిన్’గా మారింది. విజయ్ స్టార్ హీరోలా కాకుండా సగటు ప్రేక్షకుడి కోణంలో కథలను ఎంపిక చేసుకుంటారు. ఆయన కథను మాత్రమే నమ్ముతారు కాబట్టి అగ్ర దర్శకులకే కాకుండా కొత్తవారికీ అవకాశం ఇస్తుంటారు’’ అని అన్నారు.
‘‘బీస్ట్.. ఫుల్ మాస్, కమర్షియల్ ఫిల్మ్. ఇందులోని ట్విస్ట్‌లు మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తాయి. అనిరుధ్‌కు నేనప్పటి నుంచో అభిమానిని. ఈ సినిమాకు అదిరిపోయే స్వరాలందించాడు. విజయ్ సర్ కెరీర్ ప్రారంభంలో ఎంత కసితో పనిచేసేవారో స్టార్డమ్ వచ్చినా అంతే కష్టపడుతుంటారు. ఆయన విషయంలో అదే నాకు స్ఫూర్తినిస్తుంది’’ అని పూజాహెగ్డే తెలిపింది. ‘‘నా గత చిత్రం ‘డాక్టర్’ను విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘బీస్ట్’నూ అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి’’ అని నెల్సన్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!