Tollywood: హిట్ కొట్టిన కొత్త కెప్టెన్లు
కొత్తదనానికి చిరునామాగా నిలుస్తుంటారు నవతరం దర్శకులు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో వారెప్పుడూ ముందుంటారు.
2022లో సత్తా చాటిన నవతరం దర్శకులు
కొత్తదనానికి చిరునామాగా నిలుస్తుంటారు నవతరం దర్శకులు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో వారెప్పుడూ ముందుంటారు. అందుకే తెరపై కొత్త ప్రతిభ మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా ఆవైపు ఓ కన్నేస్తుంటారు. గతేడాదిలాగే ఈ ఏడాదీ తెలుగు తెరపై పలువురు కొత్త దర్శకులు అదృష్టం పరీక్షించుకున్నారు. వారిలో కొందరు తొలి అడుగులోనే మెప్పించగా.. మరికొందరి ప్రయత్నాలకు ప్రశంసలు దక్కాయి. మరి ఈ ఏడాది తెరపై మెరిసిన ఆ కొత్త కెప్టెన్లు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
ఈ ఏడాది తెలుగులో చిన్న, మీడియం రేంజ్ చిత్రాల మెరుపులు బాగా కనిపించాయి. ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam), ‘ఒకే ఒక జీవితం’, ‘స్వాతిముత్యం’, ‘మసూద’ (Masooda) ఇలాంటి చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. ఎన్నో రూ.కోట్లు పోసి తీసిన భారీ చిత్రాలకంటే మిన్నగా ఆకట్టుకున్నాయి. ‘సినిమా తీయాలంటే భారీతనం కాదు.. సరికొత్త ఆలోచనలు ముఖ్యమ’ని ఈ చిత్రాలే నిరూపించాయి. వీటిని నడిపించిన దర్శకులంతా తొలిసారి కెప్టెన్ కుర్చీలో కూర్చున్నవారే. అనుభవం లేకపోయినా.. వాళ్లలో ఉన్న ఉత్సాహం, సాధించాలన్న తపనే ఇంతటి విజయాలు దక్కించుకునేలా చేసింది. ఫిబ్రవరిలో వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు విమల్ కృష్ణ. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. ఒక సింపుల్ ప్రేమకథకు ఓ క్రైమ్ ఎలిమెంట్‌ను జోడిస్తూ వినోదాత్మకంగా కథనం నడిపిన తీరు సినీప్రియుల్ని అలరించింది. ముఖ్యంగా టిల్లు పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు.. ఆ పాత్రలో సిద్ధు ఒదిగిన విధానం చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. రాధిక పాత్రలో నాయిక నేహా శెట్టి ఆకట్టుకుంది. పెళ్లి, లాక్‌డౌన్.. ఈ రెండింటినీ ముడిపెడుతూ విద్యా సాగర్ చింతా తెరకెక్కించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు చక్కటి విజయాన్నే అందుకొంది. తెలంగాణ అబ్బాయి, ఆంధ్రా అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకోవడం..లాక్‌డౌన్ వల్ల వాళ్లు అదే ఇంట్లో ఇరుక్కుపోవడం.. ఆ తర్వాత జరిగే రకరకాల పరిణామాలు, రెండు కుటుంబాల మధ్య మొదలైన అలకలు, చిర్రుబుర్రులు.. ఇలాంటి అంశాలతో సరదాగా సాగే ప్రయాణమిది.
తొలి అడుగులోనే అగ్ర హీరోల దృష్టిలో
‘బింబిసార’తో (Bimbisara) తొలి అడుగులోనే అగ్ర కథానాయకుల దృష్టిలో పడ్డారు దర్శకుడు వశిష్ఠ్. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వశిష్ఠ్ ఈ సినిమా కోసం ఓ కొత్త కోణం పట్టుకున్నారు. చరిత్రలో క్రూర రాజుగా ముద్రపడిన బింబిసారుడు మంచి మనిషిగా మారడం వెనుక ఓ చక్కటి ఫాంటసీని ఊహించుకున్నారు. చరిత్రను వర్తమానంతో ముడిపెడుతూ ఓ ఆసక్తికర కథ అల్లుకున్నారు. దాన్ని అంతే చక్కగా తెరపై ఆవిష్కరించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇప్పుడాయన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘బింబిసార2’ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) అంటూ ఓ వినూత్నమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో అలరించారు హీరో శర్వానంద్. ఈ చిత్రంతోనే దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్నీ దక్కించుకున్నారు శ్రీ కార్తీక్. వాస్తవానికి టైమ్ మిషన్ కథలు మనకు కొత్తేమీ కాకున్నా.. ఇందులో దాన్ని అమ్మ అనే ఎమోషన్‌తో జత చేసి ప్రేక్షకుల హృదయాల్ని కదిలించారు కార్తీక్. ఈ ఏడాది తెలుగులో సరోగసి (అద్దె గర్భం) నేపథ్యంలో రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ఒకటైన ‘స్వాతిముత్యం’ సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాతోనే బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకు పరిచయమయ్యారు. ఇక ఇటీవలే ‘మసూద’తో ప్రేక్షకుల్ని భయపెట్టారు దర్శకుడు సాయికిరణ్. చాలా తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు చక్కటి వసూళ్లు దక్కించుకుంది. ఈ కొత్త దర్శకులందరి నుంచి భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలొచ్చే అవకాశముంది. కొత్త ఏడాదిలో తెరపై అదృష్టం పరీక్షించుకోనున్న నవతరం దర్శకులకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?
-
Politics News
Revanth reddy: రాజ్‌భవన్ వేదికగా ఆ ఇద్దరూ డ్రామాకు తెరలేపారు: రేవంత్ రెడ్డి
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Crime News
Hyderabad: భాగ్యనగరంలో పేలుడు పదార్థాల కలకలం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భద్రత కుదింపు