‘రాధేశ్యామ్‌’ గానం

విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది ‘రాధేశ్యామ్‌’ బృందం. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమ కథా చిత్రమిది. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Published : 07 Dec 2021 01:58 IST

విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది ‘రాధేశ్యామ్‌’ బృందం. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమ కథా చిత్రమిది. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఈ చిత్ర హిందీ వెర్షన్‌కు సంబంధించిన రెండో పాట టీజర్‌ను విడుదల చేశారు. ‘‘సోచ్‌ లియాతో సోచ్‌ లియా..’’ అంటూ సాగుతున్న ఈ పాటకు మిథున్‌ స్వరాలు సమకూర్చగా.. మనోజ్‌ మింతాసిర్‌ సాహిత్యమందించారు. అర్జిత్‌ సింగ్‌ ఆలపించారు. దీన్ని చిత్రీకరించిన తీరును బట్టి ఇదొక విరహ గీతమని అర్థమవుతోంది. పూర్తి పాటను ఈనెల 8న విడుదల చేయనున్నారు. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే జ్యోతిష్కుడిగా కనిపించనుండగా.. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజ కనిపించనుంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌.రవీందర్‌ రెడ్డి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా దక్షిణాది వెర్షన్లకు జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని