
Updated : 24 Jan 2022 06:53 IST
Srileela: కొత్త జోడీ ముచ్చట
శ్రీలీల.. ‘పెళ్లి సందడి’తో పరిచయమైన కథానాయిక. తొలి సినిమాతోనే కె.రాఘవేంద్రరావు హీరోయిన్గా ప్రేక్షకుల మనసుల్ని దోచింది. పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. రవితేజతోపాటు పలువురు అగ్ర కథానాయకుల చిత్రాల కోసం ఆమెని సంప్రదించారు. తాజాగా ఆమె మరో చిత్రం కోసం ఎంపికైనట్టు తెలుస్తోంది. యువ కథానాయకుడు వైష్ణవ్తేజ్తో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే ఆ సినిమాని ప్రకటించింది నిర్మాణ సంస్థ. అందులోనే కథానాయికగా శ్రీలీల ఎంపికైందని సమాచారం. అధికారికంగా ఈ విషయం ధ్రువీకరించాలి. ఈ సినిమాకి దర్శకుడితోపాటు, ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనుంది నిర్మాణ సంస్థ.
Tags :