
Samantha: మరో ప్రత్యేక గీతంలో?
ఉ అంటావా మావా... అంటూ సమంత చేసిన ప్రత్యేక సందడి కుర్రకారుని ఊపేస్తోంది. మరోసారి ఆమెని ఆ తరహా గీతంలో చూపించే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. సమంత తొలిసారి ప్రత్యేక గీతంలో ఆడిపాడింది ‘పుష్ప’లోనే. తొలి గీతమే సంచలనాలు సృష్టించడంతో సమంతని మళ్లీ ఆ తరహా పాటల్లో చూపించేందుకు తహతహలాడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఓ యువ కథానాయకుడు చేస్తున్న సినిమా కోసం సమంతని సంప్రదించారని తెలిసింది. మరి ఆమె పచ్చజెండా ఊపుతుందా లేదా? అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.