NBK 107: మాస్‌ అవతారం

బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెర  కెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఎన్టీఆర్‌ శతజయంతిని  పురస్కరించుకుని శనివారం ఈ సినిమాలోని బాలకృష్ణ లుక్‌ని విడుదల చేశారు.

Updated : 29 May 2022 07:29 IST

బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెర  కెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఎన్టీఆర్‌ శతజయంతిని  పురస్కరించుకుని శనివారం ఈ సినిమాలోని బాలకృష్ణ లుక్‌ని విడుదల చేశారు. కత్తి చేతపట్టి మాస్‌ అవతారంలో కనిపించారు బాలకృష్ణ. ‘‘యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది.  ఇదివరకెప్పుడూ చూడని మాస్‌ లుక్‌లో, విభిన్నమైన పాత్రలో బాలకృష్ణని చూపిస్తున్నారు గోపీచంద్‌ మలినేని. ఇప్పటికే నలభై శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే సినిమా పేరుని  ప్రకటిస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. కన్నడ నటుడు దునియా విజయ్‌ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. చంద్రక రవి ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఛాయాగ్రహణం: రిషి పంజాబీ, సంగీతం: తమన్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు