Ram: చర్చలు మొదలయ్యాయా?

మరో కొత్త కలయికకి రంగం సిద్ధమైందా? రామ్‌ పోతినేని - గౌతమ్‌ మేనన్‌ జట్టు కట్టనున్నారా? ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు మొదలయ్యాయా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. రామ్‌ పోతినేని ఇటీవలే లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్‌’ చిత్రాన్ని పూర్తి చేశారు.

Updated : 30 Jun 2022 08:14 IST

మరో కొత్త కలయికకి రంగం సిద్ధమైందా? రామ్‌ పోతినేని(Ram Pothineni)- గౌతమ్‌ మేనన్‌ (Gautham Menon) జట్టు కట్టనున్నారా? ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు మొదలయ్యాయా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. రామ్‌ పోతినేని ఇటీవలే లింగుస్వామి(Lingusamy) దర్శకత్వంలో ‘ది వారియర్‌’(The Warriorr) చిత్రాన్ని పూర్తి చేశారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఆ చిత్రం జులైలోనే విడుదల కానుంది. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో సినిమాకి కొబ్బరికాయ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రేమకథలైనా సరే, యాక్షన్‌ కథలకైనా రెడీ అన్నట్టుగా కనిపించే రామ్‌ కోసం గౌతమ్‌ మేనన్‌ ఓ కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొంతకాలంగా కథా చర్చలు జరుగుతున్నాయి. మేకింగ్‌లో ప్రత్యేకమైన శైలి ఉన్న గౌతమ్‌ మేనన్‌.. రామ్‌తో జట్టు కట్టనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని