Tollywood:తెరపైకి మంగళ్‌యాన్‌ విజయగాథ

అంతరిక్ష పరిశోధనల్లో భారత దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మంగళ్‌యాన్‌ మిషన్‌. అతి తక్కువ ఖర్చుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఈ మార్స్‌ మిషన్‌..

Updated : 06 Aug 2022 02:29 IST

అంతరిక్ష పరిశోధనల్లో భారత దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మంగళ్‌యాన్‌ మిషన్‌. అతి తక్కువ ఖర్చుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఈ మార్స్‌ మిషన్‌.. తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా లక్ష్యాన్ని సాధించి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇప్పుడీ మంగళ్‌యాన్‌ విజయగాథను ‘యానం’ పేరుతో తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు వినోద్‌ మంకర. ప్రపంచ సినిమా చరిత్రలో మొట్ట మొదటి సైన్స్‌ - సంస్కృత చిత్రమిది. ఇస్రో మాజీ చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ రచించిన ‘మై ఒడిస్సీ: మెమోయిర్స్‌ ఆఫ్‌ ది మ్యాన్‌ బిహైండ్‌ ది మంగళ్‌యాన్‌ మిషన్‌’ పుస్తకాధారంగా దీన్ని తెరకెక్కించారు. ఇది ఆగస్టు 21న చెన్నైలో ప్రదర్శితం కానుంది. ఈ చిత్ర ప్రీమియర్‌ను ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని దర్శకుడు   అధికారికంగా ప్రకటించారు. ‘‘ఇస్రోతో పాటు అందులోని శాస్త్రవేత్తల శక్తి సామర్థ్యాలను ప్రపంచం ముందు ప్రదర్శించడమే ఈ డాక్యుమెంటరీ లక్ష్యం. భారతీయ శాస్త్రవేత్తలు అన్ని పరిమితులను అధిగమించి.. సంక్లిష్టమైన మార్స్‌ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే ఎలా   సాధించారో ఇది వివరిస్తుంది. 45 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ పూర్తిగా సంస్కృతంలో ఉంటుంది’’ అని దర్శకుడు వినోద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని