RRR: జపాన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు

పాన్‌ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విదేశాల్లోనూ రికార్డులు తిరగరాస్తోంది. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Updated : 28 Nov 2022 06:58 IST

పాన్‌ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విదేశాల్లోనూ రికార్డులు తిరగరాస్తోంది. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లో అక్టోబరు 21న విడుదలైంది. 34 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి 300 మిలియన్‌ జపాన్‌ యెన్‌ల క్లబ్‌లో చేరింది. మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.18 కోట్లు. ఈ క్లబ్‌లో అత్యంత వేగంగా చేరిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది ఈ సమాచారాన్ని చిత్ర అధికారిక ట్విటర్‌లో ఆదివారం పంచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని