‘టిల్లు స్క్వేర్’.. విడుదల ఖరారు
గతేడాది ‘డీజే టిల్లు’గా వెండితెరపై సందడి చేసి.. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన అంతకు రెట్టింపు వినోదాలు పంచిచ్చేందుకు ‘టిల్లు స్క్వేర్’తో సిద్ధమవుతున్నారు.
గతేడాది ‘డీజే టిల్లు’గా వెండితెరపై సందడి చేసి.. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన అంతకు రెట్టింపు వినోదాలు పంచిచ్చేందుకు ‘టిల్లు స్క్వేర్’తో సిద్ధమవుతున్నారు. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా రూపొందుతోన్న చిత్రమిది. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోమవారం అధికారికంగా ప్రకటించాయి. ఈ సందర్భంగా విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాయి. అందులో సిద్ధు - అనుపమ రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. ‘‘తొలి భాగాన్ని మించిన వినోదాన్ని, థ్రిల్‌ను ఈ రెండో భాగం అందిస్తుంది. ఇది ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: 2024లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా..? కొత్త ఫార్ములా రూపొందిస్తున్న లా కమిషన్!
-
Giant wheel: వామ్మో.. సరదాగా జెయింట్ వీల్ ఎక్కితే నరకం కనిపించింది!
-
Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్