ఆర్యన్‌ఖాన్‌ దర్శకత్వంలో..

బాలీవుడ్‌ అగ్ర హీరో షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ‘స్టార్‌డమ్‌’ అనే వెబ్‌సిరీస్‌ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 07 Jun 2023 01:47 IST

బాలీవుడ్‌ అగ్ర హీరో షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ‘స్టార్‌డమ్‌’ అనే వెబ్‌సిరీస్‌ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో లక్ష్య లల్వానీ కథానాయకుడు. తొలి అడుగులోనే భారీ విజయం దక్కించుకోవాలనే ఉద్దేశంతో కథ, స్క్రీన్‌ప్లే, లొకేషన్లు, తారాగాణం.. ఇలా అన్ని విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ని ఓ అతిథి పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం. ఆ వార్తలు నిజమనేలా.. రణ్‌బీర్‌ తాజాగా సెట్‌ని సందర్శించిన ఫొటోలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సిరీస్‌లో దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ సైతం ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు గతంలోనే ప్రకటించారు. రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై షారుక్‌, గౌరీఖాన్‌లు ఈ వెబ్‌సిరీస్‌ని నిర్మిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు