పేపర్‌బాయ్‌.. డాక్టర్‌ ప్రేమలో పడితే?

అముద శ్రీనివాస్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘నా.. నీ ప్రేమకథ’. పోత్నాక్‌ శ్రవణ్‌ కుమార్‌ నిర్మాత. కారుణ్య చౌదరి కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదల కానుంది.

Updated : 26 Aug 2023 04:09 IST

ముద శ్రీనివాస్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘నా.. నీ ప్రేమకథ’. పోత్నాక్‌ శ్రవణ్‌ కుమార్‌ నిర్మాత. కారుణ్య చౌదరి కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. దీంట్లో నేను పేపర్‌బాయ్‌గా కనిపిస్తా. కథానాయిక డాక్టర్‌. మరి వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది ఆసక్తికరం. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులూ చూడాల్సిన సినిమా. తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్‌ కుమార్‌, ప్రసన్న కుమార్‌, రామకృష్ణ గౌడ్‌, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని