KG Jayan: ప్రముఖ సంగీత దర్శకుడు కేజీ జయన్‌ మృతి

ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు కేజీ జయన్‌(90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ కేరళలోని త్రిపుణితురలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Updated : 17 Apr 2024 12:16 IST

ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు కేజీ జయన్‌(90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ కేరళలోని త్రిపుణితురలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. కేజీ జయన్‌ తన సోదరుడైన దివంగత విజయన్‌తో కలిసి ‘జయవిజయ’ పేరుతో ఎన్నో అయ్యప్ప భక్తి గీతాలను ఆలపించి ప్రశంసలు అందుకున్నారు. 1000కి పైగా పాటలను రూపొందించిన ఆయన పలు మలయాళ, తమిళ చిత్రాలకు స్వరాలు అందించారు. కేజీ జయన్‌.. 2019లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. నటుడు మనోజ్‌ కే జయన్‌ ఈయన కుమారుడు. కేజీ జయన్‌ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని