Manamey: ఈ వేసవిలో... ‘మనమే’

‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్‌’ అని నమ్మే ఓ అమ్మాయి.

Updated : 20 Apr 2024 12:13 IST

‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్‌’ అని నమ్మే ఓ అమ్మాయి. భిన్న ధృవాల్లాంటి ఈ ఇద్దరి మధ్యకి ముద్దులొలుకుతున్న ఓ చిన్నారి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘మనమే’ చూడాల్సిందే. శర్వానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. మాస్టర్‌ విక్రమాదిత్య కీలక పాత్ర పోషించారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఆహ్లాదాన్ని పంచుతూ, అలరించే ఓ కొత్తతరం  చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంభాషణలు: అర్జున్‌ కార్తిక్‌, ఠాగూర్‌, వెంకీ, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, ఛాయాగ్రహణం: విష్ణుశర్మ, జ్ఞానశేఖర్‌.వి.ఎస్‌, కూర్పు: ప్రవీణ్‌పూడి, కళ: జానీ షేక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని