Ghani: బాక్సర్‌గా వరుణ్‌తేజ్‌.. పాత్ర కోసం ఇంత కష్టపడ్డాడా..!

యువ నటుడు వరుణ్‌తేజ్‌ తొలిసారి నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 05 Apr 2022 13:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు వరుణ్‌తేజ్‌ తొలిసారి నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. నటులు అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌ సెట్స్‌లో చేసిన సందడితో పాటు బాక్సింగ్‌ సన్నివేశాలను ఎలా తెరకెక్కించారో, నాయకా నాయికలు డ్యాన్స్‌ ఎలా చేశారో ఈ వీడియోలో చూడొచ్చు. బాక్సర్‌ పాత్ర కోసం వరుణ్‌తేజ్‌ ఎంత కష్టపడ్డాడో ఆయన చేసిన కసరత్తులు చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో వరుణ్‌ సరసన బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ సందడి చేయనుంది. సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషించారు. అల్లు బాబీ, సిద్ధూ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు