పూజాను చూసి అఖిల్‌ ఫిదా..!

కథానాయిక పూజాహెగ్డేను చూసి అఖిల్‌ ఫిదా అయ్యారు. ఆమె సౌందర్యాన్ని చూస్తూ.. మాటల్ని వింటూ నవ్వుతూ అలాగే నిల్చుండిపోయారు. అయితే ఇదంతా కేవలం సినిమాలో మాత్రమే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’....

Published : 13 Feb 2021 13:54 IST

హైదరాబాద్‌: పూజాహెగ్డేను చూసి అఖిల్‌ ఫిదా అయ్యారు. ఆమె సౌందర్యాన్ని చూస్తూ.. మాటల్ని వింటూ నవ్వుతూ అలాగే నిల్చుండిపోయారు. అయితే ఇదంతా కేవలం సినిమాలో మాత్రమే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ విడుదలయ్యింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా  ‘గుచ్చే గులాబిలాగా’ అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం సినీప్రియులతో పంచుకుంది. ఇప్పటికే విడుదలైన ‘మనసా మనసా’ పాట ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విడుదలైన సరికొత్త పాట కూడా హృదయాలను హత్తుకునేలా ఉంది.

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ స్వరాలు అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘గుచ్చే గులాబిలాగా’ పాటను అర్మాన్‌మాలిక్‌ అలపించారు. జూన్‌ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి

రాజమౌళి మాట నమ్మాలనుకోవడం లేదు
సుమంత్‌ పెళ్లి వేడుకలు షురూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు