Harish Shankar: ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షురూ.. డైరెక్టర్‌ ఫీలింగ్‌ ఏంటో తెలుసా..!

పవర్‌స్టార్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ నుంచి కీలక అప్‌డేట్‌ వెలువడింది.

Published : 05 Apr 2023 11:01 IST

హైదరాబాద్‌: ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’(Ustaad BhagathSingh).. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) - హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో రానున్న ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని పవర్‌స్టార్‌ అభిమానులు వేచి చూస్తున్నారు. హరీశ్‌ శంకర్‌ సైతం తన అభిమాన నటుడిని డైరెక్ట్‌ చేయడం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు హరీశ్‌ బుధవారం ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ బయటపెట్టారు. నేటి నుంచి ఈ సినిమా షూట్‌ మొదలైనట్లు చెప్పారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసిందని పేర్కొంటూ.. ‘మంచి మిత్రులు’ సినిమా నుంచి ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ పాటను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసి తన ఆనందాన్ని బయటపెట్టారు. దీనిని చూసిన నెటిజన్లు హరీశ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత హరీశ్‌ - పవన్‌కల్యాణ్‌ కాంబోలో రానున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇది నిర్మితం కానుంది. ‘భవధీయుడు భగత్‌సింగ్‌’ గా గతేడాదిలోనే అనౌన్స్‌ చేసిన ఈ ప్రాజెక్ట్‌ టైటిల్‌ను ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’గా మారుస్తున్నట్లు ఈ ఏడాది వెల్లడించారు. రాజకీయాలు, ఇతర సినిమా షూట్స్‌తో పవన్‌ బిజీగా ఉండటం వల్ల ఇప్పటి వరకూ ఆగిన ఈ ప్రాజెక్ట్‌ రెగ్యులర్‌ షూట్‌ ఇకపై జరగనుంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి రోజు షూట్‌ జరగనున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని