Harnaaz Sandhu: ఈ టైటిల్‌ దేశానికి అంకితం: మిస్‌ యూనివర్స్‌ హర్నాజ్‌ సంధు

ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆమె పేరే! ఆమే భారత యువతి హర్నాజ్‌ సంధు. నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈపేరు.. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 21ఏళ్ల అనంతరం భారత దేశానికి విశ్వసుందరి కీరాటాన్ని తెచ్చిపెట్టింది ఈ 21ఏళ్ల పంజాబీ ముద్దుగుమ్మ.

Published : 14 Dec 2021 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆమె పేరే! ఆమే భారత యువతి హర్నాజ్‌ సంధు. నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈపేరు.. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 21 ఏళ్ల అనంతరం భారత దేశానికి విశ్వసుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టింది ఈ 21 ఏళ్ల పంజాబీ ముద్దుగుమ్మ. ఇజ్రాయెల్‌లో నిర్వహించిన విశ్వసుందరి పోటీల కోసం నవంబర్‌ 27న భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌కి పయనమైంది. చివరికి టైటిల్‌ సొంతం చేసుకుని.. తన మనుసులో భావాలను ఇన్‌స్టాలో పంచుకుంది.

‘‘మిస్ యూనివర్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను ఎంపికై 74 రోజులు గడిచాయి. ఇష్టం, కష్టం, సరదాగా గడిపిన క్షణాలతో ఈ ప్రయాణం మధురానుభూతినిచ్చింది. ఈరోజు ఈ వేదికపై మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ని మీ అందరి ప్రార్థనలు, ప్రేమతో భారత్‌కి అందించా. ఈ సందర్భంగా నేను థాంక్స్‌ చెప్పాల్సింది మా కుటుంబ సభ్యులకు. ఎందుకంటే వాళ్లంతా ఇప్పుడూ ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. మీ ముందుకు నన్ను ఇంత అందమైన మహిళగా తీర్చిదిద్దిన మా ప్యానలిస్టులు (స్కిన్‌ కేర్‌ ఎక్స్‌పర్ట్‌, స్మైల్‌ కేర్‌ ఎక్స్‌పర్ట్‌, ర్యాంప్‌ వాక్‌ ట్రైనర్‌, కమ్యూనికేషన్‌ ఎక్స్‌పర్ట్‌, వాయిస్ క్రాఫ్టింగ్‌ ట్రైనర్‌, పిలేట్స్‌ ఎక్స్‌పర్ట్‌, జిమ్‌ పార్టనర్‌, హెయిర్‌ కోచ్‌, మేకప్‌ ఎక్స్‌పర్ట్‌, సెలూన్‌ పార్టనర్‌, హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌, ఫుట్‌ వేర్‌)తో పాటు డిజైనర్లకు నా ధన్యవాదాలు. అలాగే అందరికీ ధన్యవాదాలు. మీరెవరూ లేకుండా నా కల నిజమయ్యేది కాదు. చివరిగా.. నా ప్రియమైన దేశం.. ఇండియాకు మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ అంకితం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసిన లేఖను విడుదల చేశారు. 17 ఏళ్ల వయసులోనే ‘టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌’, 2021లో ‘మిస్‌ దివా యూనివర్స్’ కిరీటాన్ని దక్కించుకున్నారు హర్నాజ్‌ సంధు. మోడలింగే కాకుండా ‘యారా దియన్ పూ బరన్’, ‘బాయి జీ కుట్టాంగే’ వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని