Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్‌ నాకు తెలుసు: ‘7/జీ బృందావన కాలనీ’ ఫేమ్‌ రవికృష్ణ

రవికృష్ణ (Ravikirishna) నటించిన ‘7/జీ బృందావన కాలనీ’ త్వరలో రీ రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Updated : 20 Sep 2023 17:13 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పిరియాడికల్‌ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఉద్దేశిస్తూ నిర్మాత ఏ.ఎం.రత్నం తనయుడు, నటుడు రవికృష్ణ (Ravi Krishna) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ సినిమా స్క్రిప్ట్‌ తెలుసని.. అభిమానుల ఎదురుచూపులకు ఇది సరైన సమాధానం ఇవ్వనుందన్నారు. ఎవరి ఊహలకు అందని విధంగా ఇది ఉంటుందని చెప్పారు.

స్టేజ్‌పై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. వీడియో వైరల్‌

అనంతరం ఆయన తన కెరీర్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘నేను అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. తొలిచిత్రం ‘7/జీ బృందావన కాలనీ’తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నా కాస్ట్యూమ్స్‌ను నేనే డిజైన్‌ చేసుకున్నా. ఆ సినిమా తర్వాత నాకు ఎన్నో ఆఫర్స్‌ వచ్చాయి. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ‘7/జీ బృందావన కాలనీ’ సీక్వెల్‌ పట్టాలెక్కనుందని అన్నారు. పార్ట్‌ 1ను తెరకెక్కించిన సెల్వరాఘవన్‌..  సీక్వెల్‌నూ సిద్ధం చేయనున్నారు. ఇందులో నేను, సుమన్‌ శెట్టి, సీనియర్‌ నటి సుధ నటించనున్నాం. హీరోయిన్‌ ఎవరు? అనేది త్వరలోనే చెబుతా’’ అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ‘కొమురం భీముడో’ పాట చూసి వీరాభిమానిని అయ్యానని అన్నారు. ఆ పాట చూసినప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని