Varun Tej: ప్రపంచ సుందరితో?
యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ మాజీ ప్రపంచ సుందరితో జట్టు కట్టనున్నాడా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వినిపిస్తోంది. వరుణ్‌తేజ్ తదుపరి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది.
యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ (Varun Tej) మాజీ ప్రపంచ సుందరితో జట్టు కట్టనున్నాడా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వినిపిస్తోంది. వరుణ్‌తేజ్ తదుపరి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. యథార్థ సంఘటనల ఆధారంగా, వైమానిక దళం నేపథ్యంలో సాగే కథ ఇది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరులో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ (Manushi Chillar) ఎంపికైనట్టు సమాచారం. ‘పృథ్వీరాజ్’ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన ఈమె వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు