Nikhil: ‘కార్తికేయ-2’ 48 గంటల్లో 100 కోట్ల నిమిషాలు చూసేశారు...!
దసరా సందర్భంగా జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కార్తికేయ 2. అక్కడ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
హైదరాబాద్: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా ఈ ఏడాది ఆగస్టు 13న విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతిచోటా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆసక్తి రేకెత్తించే కథాంశం.. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్.. ఉత్కంఠ రేపే సన్నివేశాలు ఉండడంతో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూశారు. దసరా సందర్భంగా ఈ చిత్రం జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన 48 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి వంద కోట్ల నిమిషాలు చూసి రికార్డు సృష్టించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మేనన్, తులసి, వైవా హర్ష తదితరులు కీలక పాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్