Adipurush: సుగుణాల సీతమ్మ

రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. రాఘవ్‌గా ప్రభాస్‌...జానకి పాత్రలో కృతిసనన్‌ నటించారు. ఓంరౌత్‌ దర్శకుడు.

Updated : 30 Apr 2023 05:57 IST

రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. రాఘవ్‌గా ప్రభాస్‌...జానకి పాత్రలో కృతిసనన్‌ నటించారు. ఓంరౌత్‌ దర్శకుడు. టి సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌తో పాటు ప్రమోద్‌, వంశీ కలిసి నిర్మిస్తున్నారు. సీతానవమి సందర్భంగా శనివారం ఈ సినిమాలోని కృతిసనన్‌ పోషించిన జానకి లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘‘అంకితభావం... ధైర్యం...  స్వచ్ఛత... త్యాగాలకి ప్రతిరూపం సీత. ఇలా ఎన్నెన్నో సుగుణాలున్న సీతమ్మకి ఎన్నో పేర్లు. అందులో జానకి ఒకటి. ఆ పాత్రలో కృతిసనన్‌ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. లుక్‌తో పాటు విడుదల చేసిన రాం సియా రామ్‌ పాట జానకికి రాఘవపై నున్న అచంచలమైన భక్తిని తెలియజేస్తుంది. ఈ పాట ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఈ గీతాన్ని సచేత్‌ - పరంపర స్వరపరిచార’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని