Maa: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు కొనసాగింపు

తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు నటుడు మంచు విష్ణే అధ్యక్షుడిగా కొనసాగాలని హైదరాబాద్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్‌ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Updated : 09 Apr 2024 09:38 IST

తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు నటుడు మంచు విష్ణే అధ్యక్షుడిగా కొనసాగాలని హైదరాబాద్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్‌ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సుమారు 400మంది సభ్యులు హాజరైన ఈ సమావేశంలో మేలో జరగాల్సిన ‘మా’ ఎన్నికలు, జులైలో జరగనున్న నిధుల సేకరణ కార్యక్రమం, ‘మా’ భవన నిర్మాణంలో కొనసాగుతున్న వివిధ ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘మా’ భవనం పూర్తయ్యే వరకు అధ్యక్షుడు విష్ణు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి ప్రస్తుత సభ్యులందరి నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. ఈ సందర్భంగా తమపై ఇంతటి విశ్వాసాన్ని ఉంచిన సభ్యులందరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. తనకు, తన ప్యానెల్‌కు అప్పగించిన బాధ్యతను గుర్తించి ‘మా’ సభ్యులందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని