Pushpa: ‘పుష్ప 2’లో హైలెట్‌ అదే.. అంచనాలు పెంచేలా దేవిశ్రీ ప్రసాద్‌ కామెంట్స్‌

అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఆసక్తికర విషయాలు చెప్పారు.

Published : 21 Nov 2023 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) ఆ అంచనాలు రెట్టింపయ్యే అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని తెలిపారు. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలెట్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అర్జున్‌ పెర్ఫామెన్స్‌ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఈ సినిమా నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుందని, ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుందని తెలిపారు. జాతర ఎపిసోడ్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ (అల్లు అర్జున్‌ లుక్‌) ఇప్పటికే విడులైన సంగతి తెలిసిందే.

‘గుంటూరు కారం’ పాటల విడుదలపై ప్రశ్న.. నిర్మాత సమాధానమేంటంటే?

2021 డిసెంబరులో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా ‘పుష్ప 2’కు తెరకెక్కుతోంది. రష్మిక (Rashmika) కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ‘పుష్ప’ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డురావడం, దేవిశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ‘పుష్ప 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని