BRO: కమాన్‌ కమాన్‌ డ్యాన్స్‌ బ్రో

‘‘మై డియర్‌ మార్కెండేయా... మంచి మాట చెప్తా రాసుకో...’’ అంటూ సందడి షురూ చేశారు పవన్‌కల్యాణ్‌. ఇదంతా ‘బ్రో’ కోసమే. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న తొలి  చిత్రం ‘బ్రో’.

Updated : 09 Jul 2023 14:07 IST

‘‘మై డియర్‌ మార్కెండేయా... మంచి మాట చెప్తా రాసుకో...’’ అంటూ సందడి షురూ చేశారు పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan). ఇదంతా ‘బ్రో’ (BRO) కోసమే. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటిస్తున్న తొలి  చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఈ నెల 28న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేశారు. ‘కమాన్‌ కమాన్‌ డ్యాన్స్‌ బ్రో...’ అంటూ మొదలయ్యే ఈ పాటని తమన్‌ స్వర పరచగా, రేవంత్‌, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి రచించారు. గణేశ్‌ స్వామి, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘మళ్లీ భూమికి రానే రావు నిజం తెలుసుకో... పక్క దిగి నిద్రలేచి ప్రతి రోజూ పండగ చేసుకో...’ అంటూ సందేశాత్మకంగా సాగే పంక్తులు ఈ పాటలో వినిపిస్తాయి. ఈ పాటలో పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌తోపాటు, ఊర్వశి రౌతేలా సందడి చేయనున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్‌, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, పృథ్వీరాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజీత్‌ వాసుదేవ్‌, సంగీతం: తమన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: నవీన్‌ నూలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని