Godfather: ‘గాడ్ ఫాదర్’ కోసం నయనతార ఆ కండీషన్ పెట్టిందా?
చిరంజీవి కథానాయకుడి మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో
హైదరాబాద్: చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో మంజు వారియర్ పాత్రను తెలుగులో నయన్, ఆమె భర్తగా వివేవ్ ఒబెరాయ్ పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నారు. అయితే, ఈ విషయమై నయన్ ఒక కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
తన భర్త పాత్రలో గుర్తింపు ఉన్న నటుడిని కాకుండా యువ కథానాయకుడిని పెట్టడం పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారట. తనకు జోడీగా నటించేంత పాపులారిటీ ఆయనకు లేదు కదా! అన్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ, చిరంజీవి తర్వాత అనుకున్న ముఖ్య పాత్రల్లో సత్యదేవ్ కూడా ఉన్నారని, ఇప్పుడు మార్చడం సాధ్యమయ్యే పని కాదని ఆమెతో అన్నట్లు తెలిసింది. ఎందుకంటే తొలి నుంచి విభిన్న పాత్రలతో సత్యదేవ్ మెప్పిస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా నయన్ వద్ద ప్రస్తావించారట. వివేక్ పాత్రకు సత్యదేవ్ న్యాయం చేస్తారని దర్శకుడు మోహన్‌రాజా గట్టిగా నమ్ముతున్నారని చిత్ర బృందం భావిస్తోంది. మరి వెండితెరపై నయన్-సత్యదేవ్‌ల జోడీ ఎలా ఉంటుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.