Nelson: నాపై కోపంగా ఉందా అని విజయ్‌ని అడిగా: నెల్సన్‌

‘జైలర్‌’ (Jailer) సక్సెస్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilipkumar).

Published : 13 Aug 2023 01:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జైలర్‌’ (Jailer)తో మరో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson dilipkumar). రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నెల్సన్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay)తో తనకున్న రిలేషన్‌ గురించి మాట్లాడారు. వారిద్దరి కాంబోలో వచ్చిన ‘బీస్ట్‌’ (Beast) గురించీ ఆయన స్పందించారు. ఆ సినిమా మిశ్రమ స్పందనలు అందుకోవడంపై విజయ్‌ ఎలా రియాక్ట్‌ అయ్యారో చెప్పారు.

‘‘బీస్ట్‌’కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనలు చూసి విజయ్‌తో మాట్లాడాను. ఆయన ఒక్కటే చెప్పారు. మనం నిజాయతీగా సినిమా తీశాం. అది కొంతమందికి నచ్చవచ్చు. మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. దానికి మనం ఏం చేస్తాం? నువ్వు ఏదైతే కథ చెప్పావో దాన్నే స్క్రీన్‌పైకి తీసుకువెళ్లాం. భవిష్యత్తులో మరో సినిమా చేస్తే మరింత అద్భుతంగా చేద్దామన్నారు. ఆయన మాటలు నాకు కాస్త ధైర్యాన్ని ఇచ్చాయి. దాంతో.. ‘సర్‌.. మీకు నాపై కోపంగా ఉందా?’ అని అడిగాను. దానికి ఆయన.. ‘నాకు ఎందుకు నీపై కోపం. అలా ఏమీ లేదు’ అని వెళ్లిపోయారు’’

రివ్యూ: ఉస్తాద్‌.. శ్రీసింహా నటించిన కొత్త మూవీ మెప్పించిందా?

‘‘అదే రోజు ఆయన మళ్లీ ఫోన్‌ చేసి.. ‘సినిమాపైనే మన స్నేహం ఆధారపడి ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? సినిమా ఫలితం వల్ల నాకు కోపం వచ్చిందా? అని నువ్వు అడగటం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది’ అన్నారు. బయటవాళ్లు ఎన్నో మాటలు అంటున్నారని అందుకే అలా, అడిగానని బదులిచ్చాను. ఆ సంఘటన తర్వాత మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. మొదటి రోజు నుంచి ఇప్పటికీ ‘జైలర్‌’ విషయంలో ఆయన పాజిటివ్‌గా ఉన్నారు. సినిమాకు వస్తోన్న రివ్యూలు చూసి.. ఆనందంతో నాకు సందేశాలు పంపారు. నా విషయంలో తాను ఎంతో గర్వంగా ఉన్నట్లు చెప్పారు’’ అని నెల్సన్‌ తెలిపారు. బయటవాళ్లకు ఈ విషయాలు ఏమీ తెలియక, తమకు నచ్చినట్టుగా ఏవేవో కథనాలు రాస్తుంటారని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని