Pooniyin Selvan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’పై సెన్సార్‌ సభ్యుడినంటూ రివ్యూ.. సుహాసిని ఫైర్‌

చోళ సామ్రాజ్యం వైభవం.. పరిపాలించిన రాజులు.. అంతర్గతంగా వారు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆధారంగా చేసుకొని సిద్ధమైన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’...

Updated : 30 Sep 2022 20:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చోళ సామ్రాజ్యం వైభవాన్ని తెలిపేలా రూపొందిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు చిత్రబృందం, ఇటు సినీ ప్రియులందరూ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తుంటే.. ఉమైర్‌ సంధు అనే వ్యక్తి మాత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’పై తన రివ్యూ బయటపెట్టాడు.

తాను ఒవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడినని చెప్పుకొనే ఉమైర్‌.. ఈ చిత్రానికి 3 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చాడు.  విజువల్‌ ఎఫెక్ట్స్‌, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తన నటనతో అదరగొట్టేసిందని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ అంతటా వైరల్‌గా మారి.. మణిరత్నం సతీమణి, నటి సుహాసిని కంటపడింది. దాంతో ఆమె ఉమైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసలింతకీ మీరు ఎవరు? సినిమా రిలీజ్‌ కాకుండానే మీరెలా రివ్యూ చెప్పగలరు?’’ అని రిప్లై ఇచ్చింది. దానిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఉమైర్‌ సంధు అనే వ్యక్తి ఫేక్‌ అని.. ఒవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడినని  చెబుతూ ఇలాంటి ఫేక్‌ రివ్యూలు పెడుతుంటాడని వివరించారు.

కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీత దర్శకుడు. లైకా ప్రొడెక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని