‘ఓ పాప..’పూర్తి వీడియో సాంగ్‌ చూసేయండి!

అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్‌’. శివరాత్రి పర్వదినాన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీలోని ‘ఓ

Published : 13 Mar 2021 18:01 IST

హైదరాబాద్‌: అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్‌’. శివరాత్రి పర్వదినాన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీలోని ‘ఓ పాప...’అంటూ సాగుతున్న హుషారైన గీతాన్ని చిత్ర బృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. కథానాయిక లవ్‌లీసింగ్‌, శ్రీవిష్ణు తమదైన స్టెప్పులతో మెప్పిస్తున్నారు. ముఖ్యంగా బీచ్‌ లోకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. ఈ పాటను బెన్నీ దయాళ్‌, బెన్ హ్యూమన్‌,అనుదీప్‌ దేవ్‌ ఆలపించగా రామజోగయ్యశాస్త్రి సాహిత్యమందించారు. అచ్చు స్వరాలు సమకూర్చారు. ‘అలా ఎలా’ ఫేమ్‌ అనీష్‌కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి మిత్రుడైన ఎస్‌. కృష్ణ నిర్మించారు. ఆయన కథను అందించటం విశేషం. మరి లేటేందుకు ‘ఓ  పాప..’అంటూ హుషారుగా సాగుతున్న ఆ గీతాన్ని మీరు చూసేయండి!
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని